Swachha Pachwada Sep 1 to Sep 15 Guidelines and Day wise Schedule in Telugu

*కార్యాచరణ ప్రణాళిక*

*స్వఛ్ఛతా పక్షోత్సవాలు (1-15 సెప్టెంబర్ 2021)* 

*2021 సంవత్సరమునకు గాను తేది 1 నుండి 15 సెప్టెంబర్ 2021 వరకు జరుపు "స్వచ్ఛతా పక్షోత్సవాలు" నిర్వహించుట కొరకు రోజు వారీ కార్యాచరణ ప్రణాళిక, స్వచ్ఛతా పక్షోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించడానికి కోవిడ్-19 దృష్ట్యా కింది ముఖ్యమైన సూచనలు పాటించాలి.*

*ముఖ్యమైన సూచనలు :*

*. విద్యార్థులు ఉపాధ్యాయులు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. మాస్క్ ధరించాలి మరియు సామాజిక దూరం పాటించాలి.*

*లక్షణాలు కన్పించిన వారి విషయంలో 37 పాటించాలి. (Trace. Testing మరియు Treat) స్వచ్ఛత పక్షోత్సవాలు పోటీలు అన్ని పాఠశాలలో ప్రత్యక్షంగా గాని (భౌతిక దూరం పాటిస్తూ) వర్చువల్ గాని నిర్వహించాలి. విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.*

*🔊1-15 వరకు స్వచ్ఛ పక్షోత్సవాలు*

హైదరాబాద్, *🌍పాఠశాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు స్వచ్ఛ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఓ సర్కులర్ జారీచేశారు. సెప్టెంబర్ 1 -15 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాల. షెడ్యూల్ను శ్రీదేవసేన విడుదల చేశారు.*

*రోజువారి కార్యక్రమాలు..🔰*

*💫సెప్టెంబర్ 1: స్వచ్ఛతా శపథ నిర్వహణ దినోత్సవం*


*♻️సెప్టెంబర్ 2: స్వచ్ఛతా అవగాహన దినోత్సవం*

*♦️సెప్టెంబర్ 3: సమాజానికి చేరువ కావడం (కమ్యూనిటీ ఔటచ్)*

*🛍️సెప్టెంబర్ 4,5: హరిత దినోత్సవం*


*🌻 సెప్టెంబర్ 8: స్వచ్ఛతా పోటీల దినోత్సవం*

*💱సెప్టెంబర్ 8: హ్యాండ్ వాష్ డే*

*♦️సెప్టెంబర్ 9: వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం*

*🌻 సెప్టెంబర్ 11: సమాజ భాగస్వామ్య దినోత్సవం*


*🍥సెప్టెంబర్ 13, 14: స్వచ్ఛత అమలు దినోత్సవం*

*♻️సెప్టెంబర్ 15: బహుమతుల ప్రదానోత్సవం*


*01.09.2021 (బుధవారం)*

*(స్వఛ్ఛతా శపథం నిర్వహణ దినోత్సవము) (Swachhta Shapath Day)* 

*స్వచ్ఛతా పక్షోత్సవాల మొదటిరోజు 1.09.2021 నాడు ఉపాధ్యాయులు, విద్యార్థులందరితో ఒక కార్యక్రమము ఏర్పాటు చేసి విద్యార్థులతో 'స్వఛ్ఛతా శపధం' నిర్వహింపచేయాలి మరియు ప్రార్ధనా సమావేశములో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులచే 'స్వచ్ఛత' అంశం గురించి మాట్లాడింపచేయాలి.*

*విద్యార్థులు వ్యక్తిగతంగా మరియు తరగతి వారీగా ఏదైనా ఒక స్వచ్ఛతా కార్యక్రమము వ్యక్తిగత /పాఠశాల స్థాయి/ కమ్యూనిటీ స్థాయి / ఇంటి పరిశుభ్రతను నిర్వహిస్తామని శపథం చేయాలి.*

*స్వచ్ఛతా అవగాహన సందేశంను కోవిడ్ అవగాహన సందేశాన్ని డిపార్ట్మెంట్ / సంస్థ పాఠశాల వెబ్సైట్లో పోస్ట్ చేయాలి.*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను ఫోటోలు, వీడియోలు మొదలైన వివరాలను రాష్ట్ర స్థాయి కార్యాలయానికి పంపాలి.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts