Service rules for promotion GO 9, 10 dt 25.03.2021

Service rules for promotion GO 9, 10 dt 25.03.2021

*💠SA (PD) ప్రమోషన్  PETలకే! జీవో జారీ!...*

       *GO Ms No 11 మరియు 12 తేదీ: 23.1.2009 సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తేదీ:5.2.2021 నాడు GO 2 మరియు GO 3లను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే! ఈ జీవోలతో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ etc) ప్రమోషన్ల విధానాన్ని సవరించింది కదా! ఇప్పటి వరకు SGTలు సహా అర్హతలు ఉన్న భాషా పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్ కల్పించే వారు.  2 మరియు 3 జీవోల ప్రకారం ఇకపై భాషా పండిట్లకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్ కల్పిస్తారు. SGTలు ఇకపై స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఉర్దూ) ప్రమోషన్లకు అర్హులు కారు. అదే విధంగా..... మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (మాథ్స్/ఫిజికల్ సైన్స్/బయో సైన్స్/సోషల్/ ఇంగ్లీష్ ఇకపై SGT, EGBT, Art, Drawing, Music etc.. టీచర్లకు ప్రమోషన్ కల్పించి భర్తీ చేస్తారు. ఈ ఐదు సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు LPలకు ప్రమోషన్లు ఇవ్వరు. మార్చి 25 తేదీతో ఈ రోజు జారీ చేసిన 10 నంబర్ జీవోతో స్కూల్ అసిస్టెంట్ (పీడీ) ప్రమోషన్లు ఇకపై PETలకు మాత్రమే కల్పిస్తారు. ఈ మేరకు సర్వీస్ రూల్స్ జీవో 12ని సవరించింది! పుష్కరం క్రితం ఇచ్చినట్లే ఎవరి ప్రమోషన్లు వారికే.*
*ఇకపై....*

*>SGT, EGBT, Art, Drawing, Music, Vocational Instructorలకు భాషేతర స్కూల్ అసిస్టెంట్...*

*>LPలకు భాషా స్కూల్ అసిస్టెంట్...*

*>PETలకు SA PD *

*ప్రమోషన్ కల్పిస్తారు. *

*ఒక్క మాటలో చెప్పాలంటే క్రాస్ ప్రమోషన్ విధానం పూర్తిగా రద్దయినట్లే! *










How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts