Types of Schools in Telangana

_
*📚📡*స్కూళ్ళు ఎన్నిరకాలు*?📖🔹

*💠స్కూళ్ళు ఎన్నిరకాలుగా ఉన్నాయి❓,* 
*💠ఎన్నియాజమన్యాల కింద ఉన్నాయి❓,*
*💠ఏ సిలబస్ అనుసరిస్తున్నాయి❓*,
*💠ఎవరికి ఏ విద్యనందిస్తున్నాయి❓*

*📗1. MPP స్కూళ్ళు:* అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషద్ స్కూళ్ళు ఉన్నాయి. మనదేశంలో ఇవి 1927 నుండి ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి.

*📗2. ZP స్కూళ్ళు:*  జిల్లా పరిషద్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి.ఇలాంటి  స్థానిక సంస్థల స్కూళ్ళు 1917 నుండి ఉన్నాయి.

*📗3. GHS: స్కూళ్ళు:*  పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు.

*📗4. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ :*  ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత సామాజిక వర్గాల వారిగా స్కూళ్ళను ప్రత్యేకం చేశాక 35 స్కూళ్ళు ఉన్నాయి. రకరకాలైన గురుకులాలన్నికలిపి 974 ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది.

*📗5. తెలంగాణ మోడల్ స్కూళ్ళు:* వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం 27 జిల్లాలలో 194 స్కూళ్ళు స్థాపించింది. ఇందులో  6-12 తరగతులు ఉంటాయి.

*📗6. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(TSWREI):* వీటిని 1984 లోనే స్థాపించారు. 2014 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐ.పి.ఎస్. అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళు. 268 స్కూళ్ళు పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి.

*📗7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(TTWREIS).*  ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళు.మొత్తం 187 ఉన్నాయి.

*📗8. మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI):* వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలో 142 స్కూళ్ళు,ఏర్పాటు చేశారు.ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. 19 జూనియర్ కాలేజిలు ఒక డిగ్రీ కాలేజి కూడా వీటి అధ్వర్యంలో నడుస్తున్నాయి.

*📗9. ఏకలవ్య మోడల్ రెసిడేన్షియల్ స్కూళ్ళు(TTWREIS):* రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో 16 స్కూళ్ళు మంజూరు చేశారు.

*📗10. ఆశ్రమ పాటశాలలు:* ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ శాఖ వీటిని నడిపిస్తుంది.

*📗11. కస్తుర్బా స్కూళ్ళు(KGBV):* కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. భారత ప్రభుత్వం బాలికలకు12 వ తరగతి వరకు రెసిడేన్షియల్ విద్యను అందించేందుకు 2004 లో ప్రారంబించింది.75శాతం సీట్లు SC,ST,BC,Minority కుటుంబాల పిల్లలకు మిగతా 25 శాతం సెట్లు BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు.

*📗12. నవోదయ స్కూళ్ళు: జవహర్ నవోదయ స్కూళ్ళు* భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.1986 లో CBSE సిలబస్ తో 6-12 తరగతులు చదివే తెలివైన గ్రామీణ పిల్లలకు కోసం వీటిని ప్రారంబించారు.తమిళనాడు మినహా దేశంలోని ప్రతి జిల్లాలో ఉండేలా 636 స్కూళ్ళు స్థాపించారు.

*📗13. సైనిక్ స్కూళ్ళు:* 1961లో రక్షణ శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.వి.కే. కృష్ణ మీనన్ వీటి రూపకర్త.దేశంలో 33 స్కూళ్ళు ఉన్నాయి.రక్షణ సేవలో నాయకులను తయారు చేయడానికి విద్యార్థులను సన్నద్దులను చేయడం వీటి ప్రధాన లక్ష్యం.

*📗14. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు(TMREIS)* : తెలంగాణ లోని 31జిల్లాలలో 203 స్కూళ్ళు మంజూరు చేశారు. ఇందులో 75శాతం సీట్లు ముస్లిం మైనారిటిలకుమిగతా 25శాతం BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు. వీటిలో 12 వ తరగతి వరకు కూడా అవకాశం ఉంది.

*📗15. ఎయిడెడ్ స్కూళ్ళు:*  ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు.

*📗16. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు:*  పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు. ఇందులో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు,కార్పోరేట్ స్కూళ్ళు,చారిటి సంస్థల అధ్వర్యంలో నడిచే స్కూళ్ళు ఉంటాయి.

*📗17. ఇంటర్నేషనల్ స్కూళ్ళు:* ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే డే స్కూళ్ళు.

*📗18. బోర్డింగ్ స్కూళ్ళు:*  ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్ళు.

*📗19. సింగరేణి స్కూళ్ళు:*  సింగరేణి కాలరీస్ ఎడుకేషనల్ సొసైటి అధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు. తొమ్మిది స్కూళ్ళు, ఒక డిగ్రీ కాలేజీ,ఒక జూనియర్ కాలేజీ,ఒక పాలిటెక్నిక్ కాలేజీలుఉన్నాయి.

*📗20. రైల్వే స్కూళ్ళు:*  భారత రైల్వే శాఖ 1873లోనే స్కూళ్ళు ప్రారంబించింది. చాలాకాలం ఇవి బాగా నడిచాయి. అయితే ప్రతి క్లాసుకు 15-20 రైల్వే ఉద్యోగుల పిల్లలు లేకపోతే స్కూళ్ళు రద్దు చేస్తామని దక్షిణ మద్య 2018లో రైల్వే ప్రకటించింది.

*📗21. ఆర్మీ స్కూళ్ళు:*  కంటోన్మెంట్ ఏరియాలలో 1974లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళు స్థాపించారు.ఆర్మీ వెల్ఫేర్ ఎడుకేషన్ సొసైటి పేరుతో రక్షణ శాఖ వీటిని నడిపిస్తుంది.ఇవి CBSE సిలబస్ అనుసరిస్తాయి.

*📗22. ఎయిర్ ఫోర్స్ స్కూళ్ళు:* వీటిని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్స్ అంటారు.వాయుసేన సిబ్బంది పిల్లల కోసం వీటిని స్థాపించారు.1955 నుండి రక్షణ శాఖ CBSE సిలబస్ తో నడిపిస్తున్నది.యూ.కే.జి.నుండి 12వ తగరగతి వరకు విద్యను అందిస్తారు.

*📗23. నేవీ స్కూళ్ళు:*  నేవీ ఎడుకేషన్ సొసైటి నేవీ చిల్ద్రెన్ స్కూల్స్ పేరిట వీటిని 1965 నుండి CBSE సిలబస్ తో నడిపిస్తున్నది. విశాఖపట్నం లో ఒక స్కూల్ ఉంది.

*📗24. ఆటమిక్ఎనర్జీ స్కూళ్ళు:* ఆటమిక్ ఎనర్జీ ఎడుకేషన్ సొసైటి అధ్వర్యంలో దేశంలోని 16 ప్రాంతాలలో 30 స్కూళ్ళు నడుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, మణుగూరులలో ఈ స్కూళ్ళు ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జిలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం ఈ స్కూళ్ళు స్థాపించారు.

*📗25. కేంద్రీయ విద్యాలయాలు:* భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ 1963లో వీటిని ప్రారంబించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా 1243 స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో ఒకటి నుండి 12 తరగతి వరకు అవకాశం ఉంది.

*📗26. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు:*  వివిధ రకాలైన క్రైస్తవమిషనరీల అధ్వర్యంలో దేశంలో స్కూళ్ళు స్థాపించారు.

*📗27. ఇస్లామిక్ మదర్సాలు:* ఇస్లామిక్ సంస్కృతి బోధించడానికి ఉద్దేశించినవి. వ్యాకరణం,గణితం,కవిత్వం, చరిత్ర అన్నింటికీ మించి ఖురాన్ నేర్పిస్తారు.ఎలిమెంటరి స్కూల్ ను మక్తబ్ అని సెకండరి స్కూల్ ను మదర్సా అంటారు.మన దేశంలో వారం హేస్టింగ్స్ సమయంలో కలకత్తాలో మొదట స్థాపించారు.

*📗28. గురుద్వార స్కూళ్ళు:* సిక్కుల ఆచార సంప్రదాయాల పరిరక్షణకు ఖల్సా కొన్ని విద్యా  సంస్థలను స్థాపించింది. సిక్కుమత నియమనిభందనలను పాటించేలా చూస్తాయి. ఇతర దేశాలలో కూడా ఖల్సా విద్యా సంస్థలు ఉన్నాయి.

*📗29. శిశుమందిర్ స్కూళ్ళు* :1952లో నానాజీ దేశ్ముఖ్ మొదటి స్కూలును గోరక్ పూర్ లో స్థాపించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ ల పేరిట స్కూళ్ళను రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ నడిపిస్తున్నది.

*📗30. వేద పాటశాలలు:* సాంప్రదాయ గురుకుల పద్ధతిలో వేద అధ్యయనం కోసం వీటిని స్థాపించారు. యోగ,ధ్యానం,వేదపటనం , గణితం,సేవ నేర్చుకుంటారు.

*📗31. ప్రత్యేక బోధనా పద్ధతుల స్కూళ్ళు:* మాంటిస్సొరి,జెనాప్లాన్,డాల్టన్ వంటి పద్ధతులు అనుసరిస్తూ బోధించే స్కూళ్ళు. సాదారణంగా వాటి పేర్లతోనే వాటి స్వభావం తెల్సిపోతుంది.

*📗32. స్పెషల్ స్కూళ్ళు:*  వివిధ లోపాలున్న పిల్లలకు విద్యను అందించే స్కూళ్ళు. చెవిటి-మూగ,ఎపిలెప్సి,ఆటిజం, ADHD వంటి ఇబ్బందులు ఉన్న వారికి ప్రత్యేక స్కూళ్ళు ఉన్నాయి.

*📗33. అంధుల పాటశాలలు:* బ్రెయిలీ లిపిలో విద్యను అందించే స్కూళ్ళు.

*📗34. ఓపెన్ స్కూళ్ళు:* ఇంటివద్దనే ఉండి పరీక్షలు రాసుకునే అవకాశం గల స్కూళ్ళు.

*📗35. స్పోర్ట్స్ స్కూళ్ళు:*  చదువుతో పాటు ఆటలు నేర్పించే స్కూళ్ళు.

*📗36. అనాథ పాఠశాలలు*   :ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్థలు కొన్ని అనాథ పాటశాలలు నడిపిస్తున్నాయి.

*📗37. అంగన్ వాడి స్కూళ్ళు:* గ్రామీణ పేద పిల్లల ఆకలి తీర్చి వారికి పౌష్టిక ఆహరం అందించడానికి 1975లో భారత ప్రభుత్వం ICDS కార్యక్రమం చేపట్టింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తుంది.తెలంగాణలో 35,700 అంగన్వాడి కేంద్రాలున్నాయి.

*📗38. ప్రి స్కూళ్ళు/ప్లే స్కూళ్ళు* :స్కాట్లాండ్ లో రాబర్ట్ ఓవెన్ 1816లో మొదటి ప్రి స్కూల్ స్థాపించారు.ప్రి-ప్రైమరీ, నర్సరీ,డే కేర్,కిండర్ గార్టెన్ అని వివిధ పేర్లతో వీటిని పిలుస్తున్నారు. మనదేశంలో 30శాతం గొలుసుకట్టు ప్రి స్కూల్లే ఉన్నాయి.

*📗39. ప్రైమరీ స్కూళ్ళు:*  ఒకటి నుండి అయిదు తరగతుల వరకు ఉండేవి.
*📗40. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు:* ఒకటి నుండి ఏడు తరగతుల వరకు ఉండేవి.
*📗41. హై స్కూళ్ళు/సెకండరి స్కూళ్ళు:* పదవ తరగతి వరకు ఉండేవి.
*📗42. హయ్యర్ సెకండరి/సీనియర్ సెకండరీ స్కూళ్ళు:*  12 తరగతి వరకు ఉండేవి.

*📗43. బాలుర స్కూళ్ళు:*

*📗44. బాలికల స్కూళ్ళు:*

*📗45. కో-ఎడ్యుకేషన్ స్కూళ్ళు:*

*📗46. డే స్కూళ్ళు:*
*📗47. రెసిడెన్షియల్ స్కూళ్ళు:*
*📗48. సెమి-రెసిడెన్షియల్ స్కూళ్ళు:*
*📗49. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు:*
*📗50. తెలుగు మీడియం స్కూళ్ళు:*
*📗51. ఉర్దూ మీడియం స్కూళ్ళు:*
*📗52. సంస్కృత స్కూళ్ళు:*
*53. స్టేట్ సిలబస్ స్కూళ్ళు:* Board of Secondary Education (BSE)సిలబస్ అనుసరించేవి.
*📗54. సెంట్రల్ సిలబస్ స్కూళ్ళు:* Central Board of Secondary Education (CBSE), Indian Certificate of Secondary Education (ICSE) సిలబస్ అనుసరించేవి.
*📗55. ఇంటర్నేషనల్ సిలబస్ స్కూళ్ళు:* International General Certificate of Secondary Education (IGCSE), international Baccalaureate (IB) సిలబస్ అనుసరించేవి..

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts