How to set up parent control in Google Chrome browser

ఫోన్ లో ఎక్కువ మంది వాడుతున్న నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఏ వెబ్సైట్ చూడాలనుకున్నా చాలామంది వాడేది గూగుల్ బ్రౌజర్. పెద్దలు ఈ గూగుల్ క్రోమ్ వాడినప్పుడు వారి యొక్క సర్చ్ చరిత్ర లేదా వారు చూసుకున్న వెబ్సైట్ యొక్క వివరాలు పిల్లలు చూడడం అంత మంచిది కాదు. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు పెద్దలు వాడిని వెబ్ సైట్లు పేర్లు కనబడకుండా హిస్టరీని డిలీట్ చేయాలి అదే ఎలాగో ఇప్పుడు చూద్దాం

ఎన్నెన్నో అవసరాలకు పెద్దలు ఏ వేవో రకాల వెబ్ సైట్లు చూస్తుంటారు. ఇవన్నీ పిల్లలకు తెలియడం అంత మంచిది కాదు . కాబట్టి పెద్దలు గూగుల్ క్రోమ్ వాడినా ప్రతిసారి చివరకు వారికి హిస్టరీ క్లియర్ చేస్తూ ఉండాలి.దీని కొరకు ఈ క్రింది పటంలో చూపిన విధంగా గూగుల్ క్రోమ్ లో పైన కుడి వైపు మూలకు ఉన్న మూడు చుక్కలు టచ్ చేసి  అక్కడ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్లో హిస్టరీని టచ్ చేయాలి







పై బొమ్మలో చూపించిన విధంగా క్లియర్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే పెద్దలు చూసిన ఆ వెబ్సైట్ యొక్క పేర్లు అన్ని కూడా తొలగించబడతాయి పిల్ల పిల్లలకు ఇచ్చే ప్రతిసారి చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి మనం మర్చిపోతున్నాం ప్రతిసారి డిలీట్ చేయడం అంత కష్టమైన పనే .




ఇందుకోసం, పెద్దలు ఫోన్ వాడినప్పుడు    ఇకగ్నిటో మోడ్ 2వ ఆప్షన్ వాడుకోవడం చాలా మంచిది ఈ క్రింది ఫోటోలో చూపించిన విధంగా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకోగలరు.. ఈ మోడల్లో మీరు ఏ వెబ్సైట్ చూసినా వాటి యొక్క హిస్టరీ అనేది పిల్లల గాని లేదా వేరే ఎవరికీ గాని కనపడదు అంటే మీరు చూసిన వెబ్సైట్లు బ్రౌజర్లో రికార్డ్ ఉండదు.




గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ లు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంటాయి. ఫోను పిల్లల దగ్గర ఎక్కువసేపు ఉంటుంది కావున ఇలా సేవ్ చేసి పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి వాటిని తీసి వేయాలి అది ఎలానో ఈ క్రింది ఫోటోలో చూడండి.





పై రెండు ఆప్షన్లతో పైన ఆఫ్ చేసి పెట్టుకోవాలి


బ్రౌజర్ లో పేమెంట్ మెథడ్స్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ atm కార్డు వివరాలు క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదయి ఉంటాయి సేవ్ చేసి పెట్టుకోవడం మంచిది కాదు వాటిని డిలీట్ చేయాలి అది ఎలాగో ఈ క్రింది ఫోటోలో చూడండి.




ఈ పేమెంట్ మెథడ్స్ లో కూడా ఈ ఆప్షన్ ను ఆఫ్ చేసి పెట్టుకోవాల



ఈ బ్రౌజర్ లో ఉన్న సెట్టింగ్స్ లో ప్రైవసీ లో ఉన్న ఈ రెండు ఆప్షన్స్ లో టిక్ మార్క్ తీసివేయాలి.

ఒకవేళ ఎప్పుడైనా మీరు బ్యాంకింగ్ సంబంధించిన వెబ్ సైట్లు అవసరం ఉండి వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు యూజర్నేమ్ పాస్వర్డ్లను ఎంటర్ చేసి  సేవ్ చేయకుండా ఉంచుకోండి




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts