TS DOST Notification in to Degree

*☸️తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌*

హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

*జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడద దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి ప్రకటించారు.*

*జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు.*

*జూలై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు.*

*జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.*

*జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 30వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు.*

*ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.*

*ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు*.

*ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు మూడో విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలన్నారు*.

*ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు*.

*సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.*

సాధారణంగా ప్రతి ఏడాది ఇంటర్‌ ఫలితాలు వెలువడిన రోజే దోస్త్‌ ప్రకటన విడుదల చేస్తారు.

అయితే కరోనా మహమ్మారి వల్ల ఈసారి ఆలస్యమయ్యింది. *రాష్ట్రంలోని సుమారు వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీల్లో 200 కోర్సుల్లో సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తారు.*


Website

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts