Type Here to Get Search Results !

Amazing Facts in Telugu



 

 1. నీలి ఆకాశం లో చూస్తున్నప్పుడు గానీ , లేదా మరి ఎప్పుడైనా చూస్తున్నప్పుడు గాని, మన కళ్ళల్లో ఈ ఫొటోలో చూపిన విధంగా కొన్ని తెల్లని గీతలు కదులుతూ కనబడుతుంటాయి. నిజానికి తెల్లని గీతలు కాదు, మన కంటి లోపల ఉన్న తెల్ల రక్త కణాలు.

2. మన చేతిరాత సరిగా లేదు, అంటే మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని అర్థం . ఎందుకు అంటే అప్పుడు మనము మన చేతిరాత మీద శ్రద్ధ కంటే మనం రాసే విషయం మీదనే ఎక్కువ శ్రద్ధ, ఆలోచన చేస్తూ ఉంటాం.

3. మన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రపు తీర రేఖ ఉన్న దేశం కెనడా. మరి మన భారత దేశం లో అత్యంత పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది తెలుసా  మీకు ? తెలియకపోతే ఈ క్రింది వీడియోలో జవాబు ఉంది చూడండి.

4. మనం తినే కోడి గుడ్డు లో విటమిన్ సి, కాకుండా మిగతా అన్ని విటమిన్లు, పోషక పదార్థాలు ఉన్నాయి. కాబట్టి రోజుకు ఒకటి ఉడకబెట్టిన కోడిగుడ్డు తినండి. ఆరోగ్యానికి మంచిది.

5. డాల్ఫిన్ లు చాలా తెలివైన ప్రాణులు మరియు మనిషితో చాలా చక్కటి అను బంధాన్ని కలిగి ఉంటాయి.

6. Baobab అనే ఎడారి చెట్లు మడగాస్కర్, ఆఫ్రికా, అరబ్, ఎడారిలో పెరుగుతాయి. వీటి కాండం లో సుమారుగా 32,000 గాలన్ ల నీటిని నిల్వ ఉంచుకుంటాయి అంట. 1,20,000 లీటర్ల నీరు.

7. మన ఫోన్లలో వాడే కెమెరాలు యొక్క క్వాలిటీ, నాణ్యతతో మన కన్ను యొక్క నాణ్యత 574 MP.

8. Anableps అనే చేపలకు నాలుకలు కళ్ళు ఉంటాయి. ఇది ఒకేసారి పైన క్రింద చూడగలదు. ఈ చేపలు కోస్ట మెరీనా ప్రాంతంలో, మంచినీటిలో మాత్రమే పెరుగుతాయి.

9. మన చేతి లేదా కాలి వేళ్ళు విరిచినప్పుడు, టప్ టప్ మని శబ్దం వస్తుంది. వేళ్ళు విరుగుతున్నాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు ఎముకల మధ్య ఉండే గాలి శబ్దం వల్ల ఇలా జరుగుతుంది.

10. మనము కొత్త ప్రదేశాల్లో కి వెళ్ళినప్పుడు, అక్కడ పడుకున్నప్పుడు, సరిగ్గా మనకు నిద్ర పట్టదు. దీనికి కారణం మన మెదడు అలర్ట్ గా ఉంటుంది, ఎందుకంటే కొత్త ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని ఆలోచి స్తూ మెదడు నిరంతరం గా పనిచేస్తూ ఉంటుంది.
Category