Brief Description about ITR 1, 2, 3, 4 Forms in Telugu

*🔊🗂ఎవరికి ఏ ఐటీ ఫారం..?*

*🗂ఐటీ రిటర్న్‌ల దాఖలుకు పెంచిన గడువు కూడా మరి కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఆ గడువు లోగా రిటర్న్‌లు దాఖలు చేయకపోతే జరిమానాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ పరిధిలోకి వచ్చే వారు ఏ రకం ఫారాలు దాఖలు చేయాలో తెలియజేస్తున్నారు క్లియర్‌ టాక్స్‌ సీఈఓ అర్చిత్‌ గుప్తా.*

*🌎ఐటీ రిటర్న్‌ల గడువు త్వరలో ముగిసిపోతుంది. ప్రతి ఒక్కరూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయం వివరాలు, తమ పన్ను చెల్లింపు వివరాలు తెలియజేస్తూ ఈ నెల 31 లోగా రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది గడువు పెంచకపోయి ఉంటే ఇది జూలై 31నే ముగిసిపోయి ఉండేది. ఐటీ నిబంధనల ప్రకారం జూలై 31 దాటి రిటర్న్‌లు దాఖలు చేసే వారు రూ.5,000, డిసెంబరు 31 దాటి రిటర్న్‌లు దాఖలు చేసే వారు రూ.10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు వార్షికాదాయ పరిమితి రూ.2.5 లక్షలు. ఈ వార్షికాదాయ పరిమితి 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ.3 లక్షలు, 80 సంవత్సరాలు పైబడిన వారికి రూ.5 లక్షలు ఉంది. ఎవరు ఏ ఐటీ రిటర్న్‌ (ఐటీఆర్‌) దాఖలు చేయాలో పరిశీలిద్దాం.*

*🗂ఐటీఆర్‌-1*

*వేతనం ద్వారా ఆదాయం పొందుతున్న వేతన జీవులు, ఒక ఇల్లు ఆస్తిగా కలిగిన ఇంటి యజమానులు, బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా పొదుపు సాధనాల ద్వారా వడ్డీలు పొందుతున్న పౌరులు అందరూ ఐటీఆర్‌-1 దాఖలు చేయాలి. రూ.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరూ ఈ ఫారం ఉపయోగించాలి. మీ మొత్తం ఆదాయమే వార్షికాదాయంగా పరిగణనలోకి వస్తుంది. ఈ దిగువ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.*

*🍥వేతన అలవెన్సులుఇంటి రుణం చెల్లింపులు (వడ్డీ చెల్లింపులు సహా)పీఎఫ్‌ చెల్లింపులు, ఎల్‌ఐసీ ప్రీమియం, మెడికల్‌ఇన్సూరెన్స్‌వంటివిడివిడెండ్లు, పీపీఎఫ్‌ వడ్డీ, ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ ద్వారా వచ్చే సొమ్ము వంటివి కూడా మినహాయింపుల్లో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ఆదాయాలేవీ మీ వార్షికాదాయం పరిధిలోకి రావు.*

*🗂ఐటీఆర్‌-4 :వ్యాపారాలు, వృత్తుల ద్వారా ఆదాయాలు పొందుతూ ఉండి రాబోయే ఆదాయాలపై ముందస్తు అంచనాతో పన్నులు చెల్లించిన వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు, భాగస్వామ్య కంపెనీలు (ఎల్‌ఎల్‌పీ మినహా) ఐటీఆర్‌-4 దాఖలు చేయాలి. రూ.50 లక్షల లోపు ఆదాయం గల పై శ్రేణిలోకి వచ్చే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.*

*🗂ఐటీఆర్‌-5 : ఏఓపీ (అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌), బీఓఐ (బాడీ ఆఫ్‌ ఇండివిడ్యువల్స్‌), ఎల్‌ఎల్‌పీ, సహకార సంఘాలు, ఏజేపీ (ఆర్టిఫిషియల్‌ జ్యురిడియల్‌ పర్సన్‌), స్థానిక సంస్థలు ఐటీఆర్‌-5 దాఖలు చేయాలి.*

*🗂ఐటీఆర్‌-6 : చారిటబుల్‌ ట్రస్టులు లేదా మతపరమైన సంస్థలుగా మినహాయింపులు క్లెయిమ్‌ చేసే వారు తప్ప ఇతర కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారులందరూ ఐటీఆర్‌-6 దాఖలు చేయాలి.*

*🗂ఐటీఆర్‌-7 : సెక్షన్‌ 139 (4ఎ), సెక్షన్‌ 139 (4డి) పరిధిలోకి వచ్చే ట్రస్టులు, లాభాపేక్ష లేని సంస్థలు, కళాశాలలు, ఇన్వె్‌స్టమెంట్‌ నిధుల నిర్వహణ కంపెనీలు ఐటీఆర్‌-7 దాఖలు చేయాలి.*

*🗂ఐటీఆర్‌-2*

*🍥వ్యాపారాలు లేదా వృత్తిపరమైన ఆదాయాలను మినహాయించి రూ.50 లక్షలు పైబడిన వార్షికాదాయం గల వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యుఎఫ్‌) ఐటీఆర్‌-2 దాఖలు చేయాల్సి ఉంటుంది.*

*🍥రూ.50 కోట్లకుపైబడినవార్షికాదాయం కలిగిన దేశీయ, ప్రవాస భారత పౌరులుఎన్‌ఆర్‌ఐలు తప్పనిసరిగా తమ వార్షికాదాయం వివరాలు ఐటీఆర్‌-2లో సమర్పించాలి. తాము ఎంత కాలం పాటు దేశంలోనివశించాలనుకుంటున్నారు, ఏ దేశంలో నివాసం ఉంటున్నారు, వారి విదేశీ పన్ను చెల్లింపుదారు గుర్తింపు నంబర్‌ ఏమిటి అన్న వివరాలు అందించాల్సి ఉంటుంది.ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటుకంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారు ఐటీఆర్‌-2, వ్యాపారం లేదా వృత్తి నిర్వహణలో ఉన్న వారు ఐటీఆర్‌-3 దాఖలు చేయాలి.*

*🍥ఏ స్టాక్‌ ఎక్స్ఛేంజిలోనూ లిస్టింగ్‌ కాని కంపెనీల్లో (అన్‌లిస్టెడ్‌) ఈక్విటీ షేర్లున్న వారు తప్పనిసరిగా ఐటీఆర్‌-2 దాఖలు చేయాలి. వ్యాపారం లేదా వృత్తి నిర్వహణలో ఉన్న వారు ఐటీఆర్‌-3 దాఖలు చేయాలి.*

*🍥హెచ్‌యూఎ్‌ఫలు (వ్యాపారాలు లేదా వృత్తులు నిర్వహిస్తున్న వారు మినహా) ఐటీఆర్‌-2 మాత్రమే దాఖలు చేయాలి.*

*🍥సెక్యూరిటీలు లేదా షేర్లు ఉండి వాటిపై పెట్టుబడి లాభాలు పొందుతున్న లేదా స్థిరాస్తులు విక్రయించడం ద్వారా పెట్టుబడి లాభాలు పొందిన వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలుఇల్లు విక్రయించడం ద్వారా నష్టపోయిన వారు, ఆ నష్టాన్ని ముందు సంవత్సరాలకు బదిలీ చేయాలనుకునే వారుఒకటికి మించిన ఇళ్లు ఆస్తిగా గల దేశీయపౌరులువిదేశీఆదాయాలు, ఆస్తులు కలిగి ఉండి, వాటిపై ఆ దేశంలో చెల్లించిన పన్నులపై క్రెడిట్‌ కోరేవారు కూడా ఐటీఆర్‌-2 దాఖలుచేయాలి.*

*🗂ఐటీఆర్‌-3*

*🍥వ్యాపారాలు లేదా వృత్తుల నిర్వహణ ద్వారా ఆదాయాలు పొందుతున్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలకు ఐటీఆర్‌-3 వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.50 లక్షల లోపే ఉన్నప్పటికీ వ్యాపారాలు, వృత్తుల నిర్వహణ (భాగస్వామ్యాలు లేదా ఎల్‌ఎల్‌పీ కంపెనీలు సహా) ద్వారా ఆదాయం పొందుతున్న వారందరూ ఐటీఆర్‌-3 దాఖలు చేయాలి. ఈ ఐటీఆర్‌ దాఖలు చేసే సమయంలో వ్యక్తులు లేదా హెచ్‌యూఎ్‌ఫలు ఎవరైనా తమ వ్యాపారం ఏమిటి, లాభాలు లేదా నష్టాల ఖాతా, జీఎ్‌సటీ చట్టం కింద టర్నోవర్‌, వ్యాపారానికి సంబంధించిన బ్యాలెన్స్‌ షీట్‌ కూడా జత చేయాల్సి ఉంటుంది.*

*💰వేతనం, ఇంటి ఆస్తి, వ్యాపారం లేదా వృత్తి, క్యాపిటల్‌ గెయిన్స్‌, ఇతరత్రా మార్గాల రూపంలో తాము పొందుతున్న ఆదాయాలన్నింటినీ సవివరంగా తెలియజేయాల్సి ఉంటుంది.*

*♦గమనిక: రిటర్న్‌ దాఖలు చేసే వారెవరైనా వారి ఆధార్‌ నంబర్‌ను పాన్‌తో అనుసంధానం చేయాలి. అలాగేపన్నుచెల్లింపుదారులెవరైనా (80 సంవత్సరాలకు పైబడిన వయసులో ఉండి ఐటీఆర్‌-1 లేదా ఐటీఆర్‌-4 దాఖలు చేసే వారు మినహా) ఆన్‌లైన్‌లోనే రిటర్న్‌లు దాఖలు చేయాలి.పన్ను రిటర్న్‌ ఫైలింగ్‌ సదుపాయం కల్పించే పలు వెబ్‌సైట్లు డైరెక్ట్‌ టాక్స్‌ ఫైలింగ్‌కు ఫారం 16 అప్‌లోడ్‌ చేసే సదుపాయం అందుబాటులో ఉంచడం ద్వారా కాలం, శ్రమ వృధా కాకుండా నివారిస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు రిటర్న్‌ దాఖలులో సహకరించేందుకు సీఏలను కూడా అందుబాటులో ఉంచాయి.*

*♻పాన్‌ ఆధార్‌ ఇంటర్‌చేంజ్‌ సదుపాయం ఎలా?*

*🍥2019 కేంద్ర బడ్జెట్‌లో పాన్‌, ఆధార్‌ ఇంటర్‌ చేంజ్‌ సదుపాయాన్ని ప్రకటించారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఇంతవరకు పాన్‌ తీసుకోని వ్యక్తులు ఈ సదుపాయం కింద పాన్‌కు బదులుగా ఆధార్‌ నంబర్‌ను రిటర్న్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ పాన్‌ నంబర్‌ పొందుపరచాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ దానికి బదులుగా ఆధార్‌ నంబర్‌ ఇచ్చే సదుపాయం కూడా అందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవడానికి, ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు, అధిక విలువ గల లావాదేవీల నిర్వహణకు, మరికొన్ని ఇతర కార్యకలాపాలకు పాన్‌ నంబర్‌ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంకులో సొమ్ము డిపాజిట్‌ చేయడం, డీమాట్‌ ఖాతా తెరవడం, మార్కెట్‌లో సెక్యూరిటీ లావాదేవీల నిర్వహణ, స్థిరాస్తుల క్రయవిక్రయాలు, మరికొన్ని ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్‌ నంబర్‌ ఇవ్వడం తప్పనిసరి. ముందస్తుగానే నింపిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు, బ్యాంకుల నుంచి సమాచారం సేకరించడానికి, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, మ్యూచువల్‌ ఫండ్ల లావాదేవీలకు కూడా ఈ పాన్‌, ఆధార్‌ ఇంటర్‌చేంజ్‌ సదుపాయం వర్తిస్తుంది.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts