గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి OD ఉంటుందా? ఒక ఉపాధ్యాయురాలు జనవరి 7వ తేది నుండి CL లో ఉండి 13వ తేదీన పంచాయతీ ఎలక్షన్ ట్రైనింగ్ కు హాజరయ్యారు. ఆమె గైర్హాజరును ఏవిధంగా పరిగణించాలి?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి OD ఉంటుందా? ఒక ఉపాధ్యాయురాలు జనవరి 7వ తేది నుండి CL లో ఉండి 13వ తేదీన పంచాయతీ ఎలక్షన్ ట్రైనింగ్ కు హాజరయ్యారు. ఆమె గైర్హాజరును ఏవిధంగా పరిగణించాలి?

GP ఎన్నికలు: ఉద్యోగుల ఓటు
            గత నాలుగైదు రోజులుగా చాలా మంది టీచర్లు ఫోన్ చేసి “మా స్వగ్రామంలో మాకు ఓటు ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి OD ఉంటుందా? లేక ప్రత్యేక సెలవు ఇస్తారా? ఇవేవీ లేకుంటే... మనకున్న కాజువల్ లివే పెట్టుకొనే వెళ్లి ఓటు వెయ్యాలా?” అని అడుగుతున్నారు.
      
దానికి నేనేం చెప్పానంటే...
           “ఎన్నికల సందర్భంగా... పోలింగ్ తేదీని దృష్టిలో పెట్టుకొని...  సెలవు (స్థానిక సెలవు సహా) ప్రకటించే అధికారాన్ని  రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కల్పిస్తూ 3 జులై, 2015న 54 నంబర్ జీవోని జారీచేసింది. ఆ ఉత్తర్వులకనుగుణంగా జిల్లా కలెక్టర్లు నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా కూడా జిల్లా కలెక్టర్లే సెలవులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు ఎన్నికలు జరగనున్న మూడు దశలకు సంబంధించి.... ఈనెల 21, 24,25, 29 మరియు 30వ తేదీ ....  జిల్లా అంతటా 5 రోజులు సెలవులు ప్రకటించినట్లు తెలిసింది.

              కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎన్నికలు జరిగే ఏరియాలో..... అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు పోలింగ్ జరిగే రోజు సెలవు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం పోలింగ్ జరిగే రోజుతో పాటు.....పోలింగుకు ముందు రోజు కూడా సెలవు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు...... GP ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్కూలు/ఆఫీసుకు ఆలస్యంగా రావడానికి... ముందుగా వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. 

            ఓటు వేయడం కోసం.... ఉద్యోగ, ఉపాధ్యాయులకు గతంలో కూడా ఎప్పుడూ OD ఇవ్వలేదు. ఈసారీ లేదు. సెలవు ప్రకటించడం... ప్రకటించకపోవడం అనేది కేవలం జిల్లా కలెక్టర్ల విచక్షణాధికారమే! తమ తమ జిల్లా కలెక్టర్లు జారీచేసే ఉత్తర్వులకనుగుణంగా మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయులు నడుచుకోవాలి.”

> తెలంగాణ లో సంక్రాంతి సెలవులు 11 జనవరి నుండి 17 జనవరి. ఒక ఉపాధ్యాయురాలు జనవరి 7వ తేది నుండి CL లో ఉండి 13వ తేదీన పంచాయతీ ఎలక్షన్ ట్రైనింగ్ కు హాజరయ్యారు. ఆమె గైర్హాజరును ఏవిధంగా పరిగణించాలి?

*సదరు టీచర్ 13 నాడు ఎలక్షన్ ట్రైనింగులో పాల్గొన్నారు అంటే, ఆరోజు అదర్ డ్యూటీ నిర్వహించినట్లే. కాబట్టి, సెలవు రోజైన 11 వ తేదీ, రెండవ శనివారమైన 12 వ తేదీ... రెండు రోజులు మినహాయించి.... 7 నుంచి 10వ తేదీ వరకు 4 రోజులు CL మంజూరుకు అభ్యర్థిస్తే... CLమంజూరు చేయవచ్చు!💐💐

-ఎం.ప్రతాపరెడ్డి.
GHM
Karimnagar

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts