*అటెండన్స్ సర్టిఫికెట్స్..!*
*ఈనెల 11 నుంచి 17 వరకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసందే! ఈ సంక్రాంతి సెలవుల్లో చాలామంది టీచర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో.... రిటర్నింగ్ ఆఫీసర్స్ గా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొంతమంది RPలుగా కొనసాగుతున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న SGT తత్సమాన క్యాడర్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ టీచర్లకు ఈ సందర్భంగబాధ్యతలున! సంక్రాంతి సెలవుల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న టీచర్లకు CCLకు అర్హత ఉంటుంది.*
*కాబట్టి, సెలవుల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు... అటెండన్స్ సర్టిఫికెట్స్ ఇప్పుడే తీసుకోవడం మంచిది. AROలుగా పనిచేస్తన్నవారు ROల నుంచి, ROలు సంబంధిత MPDOల నుంచి అటెండన్స్ సర్టిఫికెట్స్ తీసుకోవడం మంచిది. అటెండన్స్ సర్టిఫికెట్ లేకపోతే... CCL ప్రిజర్వుకు ఇబ్బంది అవుతుంది. పోనీ, అటెండన్స్ సర్టిఫికెట్స్ తర్వాత తీసుకుందాంలే అని భావిస్తే మాత్రం.... సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అధికారులు ఆ సమయంలో అందుబాటులో లేకపోవచ్చు... లేదా పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు! అందుకే ఇప్పుడే తీసుకోవడం ఉత్తమం! “టీచర్లే అటెండన్స్ సర్టిఫికెట్స్ తీసుకోవాలంటున్నారు.*
( Certificate Will be updated on 18.01.19 Evening )
– Pratap Reddy Maneti
Gazetted HeadMaster
Karimnagar
0 comments: