సంక్రాంతి సెలవులలో మరియు ఆదివారాల్లో జరిగిన ఎలక్షన్ ట్రైనింగ్ లకు మాకు Earned leave లు ఇస్తారా? లేదా CCLs ఇస్తారా ? GHM లకు వర్తిస్తాయా ? పరిహార సెలవులు: (COMPENSATARY CASUAL LEAVES-CCLs)

పరిహార సెలవులు: (COMPENSATARY CASUAL LEAVES-CCLs)

🌱 కార్యాలయంలో సబార్డినేట్ గా ఉండే గజిటెడ్ అధికారులు కూడా మిగితా ఉద్యోగుల్లాగే CCLs పొందవచ్చు. కానీ కార్యాలయం లో స్వతంత్రులుగా ఉండే GHMs,MEOs,DEO లు ఆ పై స్థాయి అధికారుల అనుమతితో సెలవు రోజుల్లో పనిచేసినపుడు మాత్రమే CCLs కు అర్హులౌతారు.
కానీ, కార్యాలయం లో స్వతంత్రులుగా ఉండే GHMs, MEOs, FAC వారికి DEO వారికి ఈ సెలవులు వర్తించవు.

🌱 సెలవు రోజున గాని లేక ఏ ఇతర పబ్లిక్ హాలిడేస్ రోజున కాని విధులకు హాజరవ్వమని అధికారి ఆదేశించిన సందర్భంలో నష్టపరిహారంగా సి.సి.ఎల్ మంజూరు చేయటం జరుగుతుంది.

🌱 ఈ సెలవు పనిచేసిన రోజు నుండి 6 నెలల లోపు గాని లేదా యాజమాన్యం అనుమతించినప్పటి  నుండి మాత్రమే వాడుకోవాలి.

🌱 క్యాలెండర్ సం॥లో 10 రోజులకు మించి ఇలాంటి సెలవులు మంజూరు చేయరాదు.7 రోజులకు మించి జమ చేయరాదు.
*(Govt.Memo.No.13112/58 F&P Dt: 01-03-1958)*

🌱 ఆకస్మిక సెలవు,పరిహార సెలవు రెండూ కలిపి వాడుకునే వెసులుబాటు ఉంది.అయితే రెండు కలిసి 10 రోజులకు మించరాదు.
*(Memo.No.934/poll.B/64-2 Dt:26-04-1963)*

🌱 పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం కల్పించబడింది.
*(G.O.Ms.No.50 Dt:01-02-1968)*

🌱 *సంక్రాంతి సెలవులలో మరియు ఆదివారాల్లో జరిగిన ఎలక్షన్ ట్రైనింగ్ లకు మాకు Earned leave లు ఇస్తారా? లేదా CCLs ఇస్తారా ? GHM లకు వర్తిస్తాయా ?*

సమాధానం:
🌱వేసవి సెలవులలో జరిగిన ట్రైనింగ్ గాని
ఇంకా ఏమయినా విధులు నిర్వహించిన రోజులకు దామాషా పద్ధతి లో లో EL ఇస్తారు.*

🌱సంక్రాంతి, దసరా సెలవులలో డ్యూటీ చేస్తే  CCLs మాత్రమే ఇస్తారు...కావున మీ ఎలక్షన్ order ప్రకారం మీ ddo గారితో CCLs సాంక్షన్ చేయించుకోవాలి.

– ప్రతాప్ రెడ్డి మానేటి, GHM, కరీంనగర్ గారి వివరణ

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts