HP Petrol Android APP
👉 _*ఫ్లాష్ .... ఫ్లాష్ ....*_
*హిందూస్తాన్ పెట్రోలియం ( HP పెట్రోల్ బంక్ ) వారు ప్రతి లీటర్ పెట్రోల్ పై కొంత డబ్బు ను డిస్కౌంట్ ను అందజేస్తుంది. వివరాలు స్క్రీన్ షాట్స్ తో తెలుగు లో ...*
కేవలం మన ఫోన్ నెంబర్ మరియు OTP చెప్పి పెట్రోల్ పోటించుకోవచ్చు. అతి సులభమైన క్యాష్ లెస్ పద్దతి.
*పూర్తి వివరాలకు ఈ క్రింద చదవండి*
సోపానాలు ( స్టెప్స్ ):
1. పైన క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి HP ఈ రిఫీల్ అండ్రాయిడ్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
2. మీ పేరు , ఫోన్ నెంబర్ మరియు కొన్ని వివరాల తో రిజిష్టర్ చేసుకోవాలి.
3. కొంత సమయం తర్వాత మీ ఫోన్ నెంబర్ కు ID మరియు పాస్ పోర్ట్ లు వస్తాయి.
4. మి ఫోన్ కు వచ్చిన ID మరియు పాస్ వర్డ్ లతో ఆప్ ఓపెన్ చేయాలి.
5. ఆప్ లో ఎడమ వైపు మూల వద్ద ఉన్న మూడు గీతలను టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి.
6. ఆ ఆప్షన్స్ లో Change పాస్ వర్డ్ పై టచ్ చేసి మీకు ఇష్టమైన పాస్ వర్డ్ మార్చుకోవాలి.
7. ఇదే విధంగా MPIN ను మార్చుకోవాలి. MPIN అనేది ఈ ఆప్ కు లాక్ లాగా పని చేస్తుంది.
8. రీచార్జ్ చేసుకోవడానికి ADD MONEY మీద టచ్ చేయాలి. మీ ఏటీఎం కార్డ్ తో గాని లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని డబ్బు ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇలా ఒకసారి చేస్తే చాలు.... ఇక కేవలం మన ఫోన్ నెంబర్ చెప్పి పెట్రోల్ కానీ డీజిల్ ఏ వాహనం లోనైన సరే పోయించు కోవచ్చు.
9. పెట్రోల్ డీజిల్ పొయించు కోవడం మూడు పద్దతులు ఉన్నాయి.
>>> A . బంక్ వారికి ఐదు అంకెల కోడ్ చెప్పడం ద్వారా...
ఆప్ లో Pay Merchant పై క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తే ఐదు అంకెల కోడ్ వస్తుంది. ఈ కోడ్ ను బంక్ వారికి చెప్పాలి. ఈ కోడ్ 30 నిమిషాల కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత ఈ కోడ్ పని చేయదు.
>>> B. Pay By QR Code
ఆప్ లో గల ఈ ఆప్షన్ పైన టచ్ చేసి బంక్ లో గల QR కోడ్ ను ఫోటో తీయడం ద్వారా...
>>>> C. ఫోన్ నెంబర్ మరియు OTP చెప్పడం:
ఇది అన్నిటి కన్నా సులభం. ఈ పద్దతి లో మన దగ్గర డబ్బు లేకున్నా, ఆండ్రాయిడ్ ఫోన్ లేకున్నా, ఫోన్ లేకున్నా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది.
పైన మొదట్లో చెప్పిన విధంగా ఆప్ లో డబ్బులు వేసుకున్నాక,
బంక్ లో మన ఫోన్ నెంబర్ చెప్తే వారు వారి మేసిన్ లో వారే ఎంటర్ చేసుకుంటారు. అపుడు మన ఫోన్ కు ఒక OTP వస్తుంది. ఆ OTP ని వారికి చెప్తే చాలు.
మనకు వచ్చే డిస్కౌంట్ నేరుగా మన బ్యాంక్ లో వస్తాయి. దీని కొరకు ఏమి చేయ వలసిన అవసరం లేదు.
0 Comments
Please give your comments....!!!