ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ ఆప్షన్స్ లను తక్కువ సమయం లో ఇవ్వడం ఎలా ? -  చిట్కాలు, అనుమానాలు - సమాధానాలు

👉 *ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ ఆప్షన్స్ లను తక్కువ సమయం లో ఇవ్వడం ఎలా ? -  చిట్కాలు, అనుమానాలు - సమాధానాలు*

*(  8 సం నిండిన SGT వారు కూడా అర గంట లోపల ఇవ్వవచ్చు )*

వివరాలను తెలుగు లో చదువుకోవడానికి ఈ క్రింది క్లిక్ చేయండి*

⏩ డౌట్ 1 ) :

 8 సం లు నిండిన SGT లు సుమారు 2000 ఆప్షన్ లు ఇవ్వాలి అని ఈ పని చాలా కష్టం అయిన పని అని ప్రచారం సాగుతోంది కానీ ఇది నిజం కాదు,

ఎందుకంటే,

 ఉదా: కు

 ఒక వ్యక్తి నారాయణ ఖేడ్ ( తన స్వగృహం నుండి 150 కి.మి ) నుండి సిద్దిపేట లో నివాసం ఉండాలని అనుకుంటున్నాడు. 8 సం లు పూర్తి అయ్యాయి.

ఈయన ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలో చూద్దాము..

సిద్దిపేట చుట్టూ ఉన్న మండలాలు మొత్తం 10
ఒక్కో మండలం లో 100 పోస్ట్ లు మొత్తం 1,000
8 సం లు పూర్తి అయ్యాయి కాబట్టి 30 కి.మి లోపల ఉన్న పాఠశాల లు కోరుకుంటారు ( మాన్యవల్ గా అయిన కూడా ) సిద్దిపేట చుట్టూ ఈ దూరం లో ఉండే పాఠశాల ల సంఖ్య సుమారు 800.

 ఒక వేళ 1,000 అనుకున్నప్పటికీ ఇన్ని పాఠశాల లను ఒక అర గంట లోపల ఎన్నుకోవచ్చు. ఎలా అంటే...

100 విద్యార్థుల సంఖ్య ఉన్న ఒక పాఠశాల SA పరీక్ష ఫలితాలు ను చైల్డ్ ఇన్ ఫో యందు నమోదు చేయడానికి పట్టే సమయం లో ( అర గంట లోపల ) ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు.

⏩ డౌట్ 2 ):

⏩ అరైజ్ అయిన పోస్ట్ లు చూపెట్టరు అంటున్నారు ఇది నిజం కాదు..

 అప్లై చేసుకున్న వారందరి పాఠశాల లను వెక్యాన్సీ లిస్ట్ లో చూపిస్తారు. లాంగ్ స్టాండింగ్ కానీ వారు ఎంపిక చేసుకున్న వాటిలో కొత్త పాఠశాల దొరికితే ఆ కొత్త పాఠశాల ఆ ఖాళీల లిస్ట్ నుండి డిలీట్ ఔతుంది. ఒక వేళ ఆయనకు ఏ స్కూల్ దొరకలేదు తన పాత స్కూల్ దొరికింది అపుడు పాత స్కూల్ డిలీట్ ఔతుంది. అంటే కౌన్సిలింగ్ లో తమ సీనియారిటీ ప్రకారంగా వారు కోరుకున్న పాఠశాల  వారు ఇచ్చిన క్రమంలో వారికి అయా స్కూల్ కేటాయింపు జరుగును. కేటాయింపు జరిగిన స్కూల్ ( ఈ స్కూల్ ను వేరే వారు ఎన్నుకొన్న కూడా ) వెంటేనే డిలీట్ ఔతుంది. ఒక స్కూల్ ను 100 మంది ఎన్నుకుంటే ఆ స్కూల్ 42 వ వ్యక్తి కి కేటాయింపు జరిగితే ఆ స్కూల్ పేరు 42 మంది వరకు ఉంది 43 వ్యక్తి కి వచ్చేవరకు ఆ స్కూల్ డిలీట్ ఔతుంది .మిగతా 43 నుండి 100 వరకు గల వారికి ఆ స్కూల్ ఉండదు.

👉డౌట్ 3 ) :

ఇపుడు కొత్త గా ఉపాధ్యాయులకు హోం వర్క్ ఇస్తున్నారు.

  పాత పద్ధతి లో కౌన్సిలింగ్ జరిగిన కూడా ఇలాంటి హోం వర్క్ ఉంటుందిగా, మొదట ఖాళీల వివరాలు ప్రింట్ తీసుకోవడం, అందులో ఏది కావాలో టిక్ చేయడం చేశాం కదా ఇది అంతే..

👉 డౌట్ 4 ):

లేని పోని ఇంటర్ నెట్ ఖర్చు

కౌన్సిలింగ్ వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చులకు తక్కువే...నెట్ ఖర్చు ఒక గంట కు 30 రూపాయలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అరగంటలో అయిపోతుంది.

⏩ *చిట్కాలు:*

1. ముందుగా ట్రాన్సఫర్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఎంప్లాయ్ ID, ఫోన్ నెంబర్ లతో ఎంటర్ చేస్తే OTP వస్తుంది. ఈ OTP తో వెబ్ సైట్ ను ఓపెన్ చేసాకా,  ఎడమ వైపు బాక్స్ లో మన జిల్లాలోని మొత్తం ఖాళీలు ఉన్న UDISE కోడ్ తో లిస్ట్  వస్తుంది. ఈ లిస్ట్ లో మూడు రకాల లిస్ట్ లు ఉంటాయి. అవి క్లియర్ ( రిటైర్ అయినవి ), లాంగ్ స్టాండింగ్ వి, ట్రాన్స్ ఫర్ కోసం అప్లై చేసుకున్న వారివి. మూడు కలిపి ఉంటాయి.

2. వేకెన్సు లిస్ట్ మండల్ వైస్ ఉండదు కావున పాఠశాల లను ఎన్నుకోవడం చాలా కష్టం. దీని కొరకు క్రింద ప్రకారం చేయండి.

3. ఎడమ వైపు బాక్స్ లో ఉన్న లిస్ట్ ( ఎక్సెల్ గుర్తు ) పైన క్లిక్ చేసి మీ జిల్లా లోని అన్ని రకాల వేకెన్సీ లిస్ట్ ( మూడు రకాలవి ) లను డౌన్ లోడ్ చేసుకోండి. ఇలా డౌన్ లోడ్ అయిన ఫైల్ ఎక్సెల్ లో ఉంటుంది ఇది ఫోన్ లో ఓపెన్ కాదు. కావున కంప్యూటర్ లో నే డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ఉమ్మడి మెదక్ జిల్లా ది నేను PDF లోకి మార్చి గురువు.ఇన్ లో ఉంచేదను.మిగతా జిల్లాల వి కూడా సేకరిస్తాను.

3. ప్రింట్ తీసి న తర్వాత , అందులో మీరు కోరుకునే మీకు దగ్గర లో ఉండే పాఠశాల లను గుర్తించి ఒక రెడ్ పెన్ తో మార్క్ చేసుకోండి.

4. రెడ్ పెన్ తో మార్క్ చేసుకున్న తర్వాత , వాటిని ఒక వరుస లో ఉండే విధంగా వరుస నెంబర్ లు ఇవ్వండి.

5. ఇప్పుడు ఒక తెల్ల కాగితం పైన వరుస నెంబర్ లు రాసి పెట్టుకోండి.

6. డౌన్ లోడ్ చేసుకున్న లిస్ట్ లో మీరు మార్క్ చేసి పెట్టుకున్న నెంబర్ పక్కన ఉన్న పాఠశాల ల UDISE కోడ్ రాయండి.

ఉదా:

వరుస నెంబర్.                                      UDISE కోడ్
1.                                                           98654
2.                                                           87542
3.                                                           96424
4.                                                           97422
5.                                                           68643

7. ఇలా రాసి పెట్టుకున్న కాగితం ను చూసుకుంటూ స్కూల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునే సమయంలో మనకు మండలం పేరు కనపడదు. పైన మనం కోరుకునే పాఠశాల ల UDISE కోడ్ రాసుకున్న కావున ఆన్ లైన్ లో సెలెక్ట్ చేసుకునే సమయంలో అక్కడ కనపడే UDISE కోడ్ ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

8 . ఆ కనపడే జిల్లా మొత్తం లిస్ట్ లో UDISE కోడ్ వెతకడం కష్టం గా ఉందా అయితే వెతకడం ఆపేయండి. వెతికే దగ్గర మీ ఈ పేపర్ లో మీరు రాసుకున్న UDISE కోడ్ ను టైప్ చెయ్యండి. స్కూల్ పేరు రాయడం కన్నా కోడ్ రాయడం చాలా సులభం.

9. అయిన కూడా మీకు టైప్ చేయడం కష్టం గా ఉందా అయితే మీరు రాసుకున్న పేపర్ ను తీసుకెళ్లి మీకు దగ్గర లోని ఏదైనా ఇంటర్ నెట్ సెంటర్ కు వెళ్లి అతనికి ఇస్తే కేవలం 50 రూపాయలు నుండి 100 రూపాయలు తీసుకుని 15 నిమిషాల్లో చేసి పెడతారు. ఇలా చేసే సమయం లో అతని పక్కన ఉండడం చాలా మంచిది లేకపోతే చాలా నష్టం జరుగుతుంది

10. ఒక స్కూల్ లో ఒకటి కంటే ఎక్కువ కూడా ఖాళీలు ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు లిస్ట్ లో ఆ స్కూల్ పేరు వద్ద ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని వరుస నెంబర్ లు రాసుకోవాలి. మీరు రాసుకునే తెల్ల కాగితం మీద కూడా ఒకే UDISE కోడ్ మీదా అన్ని వరుస నెంబర్ లు ఇవ్వండి.

ఉదా: రామ్ నగర్ లో 3 ఖాళీలు ఉన్నాయి.

వ.సంఖ్య.                UDISE కోడ్
1.                             19555
2.                              67890
3.                              67890
4.                              67890

👉 నెట్ సెంటర్ లో గంటల గంటలు కూర్చోవ డమా...అవసరం లేదు ఒక్క గంటలో పని అంతా అయిపోతుంది. మాన్యువల్ బదిలీల లో రాత్రి అంతా నిద్ర పోగొట్టుకుని ఎదురు చూసిన దానికంటే చాలా తక్కువ.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts