ఈ-ఫైలింగ్ మొబైల్ లో చేసుకునే విధానం- వీడియో తెలుగులో

*ఈ-ఫైలింగ్ మొబైల్ లో చేసుకునే విధానం*

                   ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ ఇప్పుడు మన మొబైల్ లో కూడా సులభంగా చేయొచ్చు.
సెక్షన్ 139 ప్రకారం ప్రతి సంవత్సరం జూలై31 లోపు,  2,50,000 ఆదాయం దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ-ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా మీ DDO లు ఆన్లైన్ లో TDS దాఖలు చేయాల్సి ఉంది.. TDS అయింది లేనిది incometax వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత FORM26AS డౌన్లోడ్ చేసుకొని చూస్తే మన పాన్ నెంబర్ ద్వారా ఎంత టాక్స్ చెల్లించింది తెలుస్తుంది.

1)ముందుగా form16 ను సిద్ధంగా ఉంచుకోవాలి.https://incometaxindiaefiling.gov.in/home
వెబ్సైట్ క్లిక్ చేయండి..
నోట్: financial year 2016-17 కు assessment year 2017-18 అవుతుంది.

2) register yourself క్లిక్ చేసి యూజర్ ఐడి గా పాన్ కార్డ్ నెంబర్ , పేరు, చిరునామా,  మొదలైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.. ఈమెయిల్ otp, మొబైల్ otp ఎంటర్ చేయాల్సి వుంటుంది.

3) తర్వాత లాగిన్ కావాలి. Dashboard లో  filling of income tax return ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు assesment year, ఫారం ITR-1, సబ్మిషన్ మోడ్ prepare and submit సెలెక్ట్ చేయాలి. తర్వాత aadhar OTP ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని continue క్లిక్ చేయాలి
*నోట్:* ఆధార్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ అయి లేకపోతే వారు, i don't want e-verify  ఆప్షన్ ఎంటర్ చేసుకొని, పూర్తిచేసిన ఫారం ను బెంగళూర్ అడ్రస్ కు పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది..
ఆధార్ otp ద్వారా అయితే ఎవరికీ ఫారం పంపాల్సిన అవసరం లేదు

4)instructions పేజీలో చదివి next క్లిక్ చేయాలి,

5)Part A -General Information పేజీ లో వ్యక్తిగత వివరాలలో ఏమైనా తేడా ఉంటే సరి చేసుకొని తర్వాత save draft క్లిక్ చేయాలి..తర్వాత next చేయాలి.

6)income details పేజీ లో ఆదాయం వివరాలు, save draft క్లిక్ చేసి next క్లిక్ చేయాలి.

7) tax details పేజీలో డిదక్షన్ వివరాలు సెక్షన్ వారీగా నమోదు చేయాలి

6)తర్వాత taxes paid and verification పేజీలో TDS వివరాలు , బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.

7)80G పేజీలో ఏదైనా విరాళాలు ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే వదిలేయాలి.

8) preview and submit ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.

ఇప్పుడు మీ e-ఫైలింగ్ పూర్తి అయినట్టు మెసేజ్ వస్తుంది. dashboard లో view returns ఆప్షన్ ద్వారా మన ITR FORM మరియు ACKNOWLEDGEMENT ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.










How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts