About Departmental Tests In Telugu

SHAREEF AHMED MD:
*తెలంగాణ ప్రభుత్వ శాఖపరమైన పరీక్షలు:* *(Departmental Tests)*

*G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం*

*అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)*

*అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు  GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.*

*కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఎటువంటి మినహాయింపు లేదు.*

*స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.*

*పదోన్నతులు(PROMOTIONS):*

*స్కూల్ అసిస్టెంట్లు,గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.*

*సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.*

*50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.*

*Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ను క్రింద చూచించిన వారు వ్రాయాలి

  *ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.*

*పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.*

*డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం  క్రింది విధంగా ఉంటుంది

*ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.*

*అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD  రాయితీని ఇవ్వరాదు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts