Clarification In Telugu About Form 10 E , Section 89 ( 1 ) Previous Assessment Years Salary Exception, with Examples

ఇన్కమ్ టాక్స్ గణనలో ఇప్పటి వరకు  ఉపయోగించని  సెక్షన్ 89(1) ఈసంవత్సరం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ఉపయోగించి గత ఆర్థిక సంవత్సరంలో పొందవలసిన జీతం కానీ జీతంలోని భాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం పొందడం వలన కట్టడం వలన అదనంగా కట్టాల్సిన టాక్స్ కి రిలీఫ్ ఉంది.
(DA ఏరియర్స్ మరియు పి.ఆర్.సి ఏరియర్స్ కి సంబంధించిన)

ఈ రిలీఫ్ పొందడానికి *Form 10E* ని జతపరచాలి.

ఈ సదుపాయం ఉందని తెలుపుతూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన సర్క్యూలర్ 29/2017 లో 3.4 నందు తెలిపారు

10E ఫారం మరియు 89(1) గురించి వివరణ


89(1) గత ఆర్థిక సంవత్సరాలలోని జీతానికి సంబంధించిన అరియర్స్ ఈ ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్నట్లయితే సదరు అరియర్స్ మొత్తానికి గత ఆర్థిక సంవత్సరాలలో తక్కువ టాక్స్ పడుతుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కడుతున్న పన్నుకి అప్పటి తక్కువ పన్నుకి తేడాను మినహాయించి టాక్స్ కట్టవచ్చు

సదరు వివరాలను 10E ఫారం రూపంలో మనం సబ్మిట్ చేయాలి.

మన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనం 2021-22, 2022-23 సంవత్సరాల అరియర్స్ తీసుకున్నాము కాబట్టి ఆయా సంవత్సరాల ఫారం 16 లలోని Taxable Income ను ప్రస్తుత software లలో ఎంటర్ చేస్తుంటే 89(1) section క్రింద ఎంత రిలీఫ్ పొందుతున్నామో latest software లు చూపిస్తూ 10E ఫారం కూడా Generate అవుతుంది.

89(1) section క్రింద మనం ఏదైనా రిలీఫ్ పొందితేనే మనం 10E ఫారం సమర్పించాలి. లేనిచో అవసరం లేదు.

ఏ కారణం చేత అయినా కొందరు ఇంకా ముందరి సంవత్సరాలలోని అరియర్స్ తీసుకున్నట్లయితే ఆయా సంవత్సరాల ఫారం 16 లలోని Taxable Income ను కూడా లెక్కలోకి తీసుకోవచ్చు.

అంతేకాకుండా 89(1) section క్రింద ఎవరైతే రిలీఫ్ పొందారో వాళ్ళు ఆ ఫైలింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో కూడా 10Eఫారం సమర్పించాలి.

ఉదాహరణకి

ప్రస్తుత సంవత్సరంలో ఒక ఉద్యోగి Taxable Income: 1123550 అందులో అరియర్స్ 2022- 23 కి సంబంధించి అరియర్స్ 49784. ఈ అరియర్స్ కి ఈ సంవత్సరంలో పడుతున్న టాక్స్: 15,382

2022-23 కి సంబంధించి Taxable Income: 965,482 పై  అరియర్స్ 38 49784 కి 2022-23 సంవత్సరంలో కట్టవలసిన టాక్స్: 11,830

ఈ సంవత్సరం గత సంవత్సర అరియర్స్ కి ఎక్కువ టాక్స్ కడుతున్నాం కాబట్టి ఆ తేడా 15382- 11830 = 3552 ను ఈ సంవత్సర టాక్స్ నుండి 89(1) సెక్షన్ ప్రకారం 10E సమర్పించి రిలీఫ్ పొందవచ్చు



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts